930 మిలియన్ డాలర్లతో ఆరు AH-64E అపాచి ఎటాక్ హెలికాఫ్టర్లు మన దేశానికి విక్రయించే ప్రతిపాదనకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది.

భారత సైన్యానికి ఆరు ఏహెచ్-64ఈ అపాచి ఎటాక్ హెలికాఫ్టర్లను 930 మిలియన్ డాలర్లకు విక్రయించడానికి సంబంధించి ఒక ఒప్పందాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదించిందని విదేశాంగ శాఖ గతరాత్రి తెలిపింది. ఈ ఒప్పందం ఆమోదం కోసం దానిని అమెరికా కాంగ్రెస్ కు పంపారు. చట్టసభ సభ్యులెవ్వరూ అభ్యంతరం తెలపకపోతే ఈ కాంట్రాక్టు యథావిధిగా కొనసాగుతుంది. బోయింగ్, దాని భారత భాగస్వామి టాటా భారతదేశంలోని ఒక కర్మాగారంలో అపాచి ఫ్యూజ్ లాజెస్ అంటే హెలికాఫ్టర్ ప్రధాన భాగం తయారు చేస్తున్నాయి.