ప్రధానమంత్రి నరేంద్రమోదీ – దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయిన్ తో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఈరోజు ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయిన్ తో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఈరోజు ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు.  ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి పలు సంతకాలు జరిగే అవకాశముంది. ఇరువురు నేతలు CEOల సమావేశంలో కూడా ప్రసంగింస్తారు. దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు – రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలుసుకుంటారు. కాగా – ఉపరాష్ట్రపతి M.వెంకయ్యనాయుడు దక్షిణకొరియా అధ్యక్షుడిని కలుసుకుంటారు. రాష్ట్రపతి భవన్ వద్ద మూన్ కు ఈరోజు సంప్రదాయ స్వాగతం లభించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఆయనకు ఘనస్వాగతం పలికారు. గతేడాది దక్షిణకొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూన్ భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. మూన్ దంపతులు నాలుగురోజుల భారత పర్యటన కోసం ఆదివారం విచ్చేశారు. ఇలాఉండగా… ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జెయిన్ నిన్న ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని ప్రారంభించారు.