పాకిస్తాన్ లో పెషావర్ లో జరిగిన ఎన్నికల సమావేశంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆవాన్ లీగ్ పార్టీ నాయకుడు హరోన్ బిల్లోర్ తో పాటు 13 మంది చనిపోయారు.

పాకిస్తాన్ పెషావర్ లో ఎన్నికల సమావేశంలో గతరాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో అవామిలీడ్ పార్టీ నాయకుడు, హరోన్ బిల్లోర్ తో పాటు 13 మంది చనిపోయారు. పెషావర్ నగరంలోని పికె 78 నియోజకవర్గంలో ఎఎన్.పి అభ్యర్థి బిల్లోర్ మరణించిన వారిలో ఉన్నారని నగర పోలీస్ అధిపతి క్వాజి అహ్మద్ చెప్పారు. బిల్లోరు స్వేచ్చావేధిక వద్దకు చేరుకునే సమయంలో బాణాసంచా వేలుస్తున్నప్పుడు ఆత్మాహుతి మానవబాంబు తనకు తాను పేల్చుకున్నాడు. బాచ్చా కాన్ గా ప్రసిద్ధి చెందిన జాతీయవాద నాయకుడు అబ్దుల్ గఫర్ ఖాన్ మనవడు ఆసిఫా నడయార్ వాలి ఖాన్ నాయకత్వంలోని ప్రధాన రాజకీయ పార్టీగా ఎఎన్.పి ఉంది.