రాజ్యసభలో సభ్యులు రానున్న వర్షాకాల సమావేశాలలో రాజ్యాంగ పరిధిలోని 22 భాషలు ప్రసంగిస్తారు.

ఈ నెల 18 తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో సభ్యులు రాజ్యాంగంలో పొందుపరిచిన 22 భాషల్లో దేనిలోనైనా మాట్లాడవచ్చు. ఇందులో భాగంగా డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, సంలీలి, సింధు భాషలు చర్చలకు ఏక కాలంలో వివరణ వచిచే ఇందులో పిటిషన్ ను ప్రవేశపెట్టినట్టు రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు వివరించారు. అస్సామి, బెంగాలీ, గుజరాతి, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దు ఈ 12 భాషలకు ఇప్పటికే ఈ సదుపాయం ఉంది. కాగా, లోక్ సభలో బోడో, మైథిలి, మణిపురి, మరాఠీ, నేపాలీ భాషా వ్యాఖ్యతలను నియిమిస్తున్నారు.