జ‌మ్మూకాశ్మీర్లో కొప్వాడ జిల్లా కాండి అడ‌వుల్లో ఉగ్ర‌వాదుల ఏరివేత చ‌ర్య‌ల్లో ఒక గుర్తు తెలియ‌ని ఉగ్ర‌వాది మ‌ర‌ణించాడు.

ఉత్త‌ర క‌శ్మీర్‌లోని కుప్వాడా జిల్లా ప‌రిధిలోని కాండీ అట‌వీ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌ల సంద‌ర్భంగా భ‌ద్ర‌త ద‌ళాల‌తో ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియ‌ని ఒక‌ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు.  సంఘ‌ట‌న ప్ర‌దేశం నుంచి అత‌డి మృత‌దేహంతోపాటు కొన్ని ఆయుధాల‌ను, ఆయుధ సామ‌గ్రిని భ‌ద్ర‌త సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇదేచోట నిన్నటి ఎదురుకాల్పుల స‌మ‌యంలో ఒక జవాను మ‌ర‌ణించ‌డంతోపాటు మ‌రొక‌రు గాయ‌పడ్డారు. ఈ నేప‌థ్యంలో ఉగ్ర‌వాదుల ఏరివేత దిశ‌గా గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. భ‌ద్ర‌త సిబ్బందికి మంగ‌ళ‌వారంనాడు ఉగ్ర‌వాద బృందం  స‌వాలు విసిరిన నేప‌థ్యంలో ఆ రోజు మ‌ధ్యాహ్నం నుంచే గాలింపు ముమ్మ‌రం చేసిన‌ట్లు భ‌ద్ర‌త‌ద‌ళ వ‌ర్గాలు తెలిపాయి. అయితే, ఆ ఉగ్ర‌వాద గుంపు త‌ప్పించుకుపోయిన‌ట్లు పేర్కొన్నాయి.