ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ ఉద‌యం 9 గంట‌ల 30 నిమిషాల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యుల‌తో సంభాషిస్తారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఈ రోజు ఉద‌యం తొమ్మిదిన్న‌ర గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యుల‌తో మాట్లాడ‌తారు. దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న‌- జాతీయ గ్రామీణ బ్ర‌తుకు దెరువు మిష‌న్‌(DAY-NRLM),  దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న‌(DDY-GKY), గ్రామీణ స్వ‌యం ఉపాధి శిక్ష‌ణ సంస్థ‌ల కింద ఉన్న బృందాలు ఈ ఇష్టాగోష్టిలో పాల్గొంటాయి. వారు చేప‌డుతున్న వివిధ కార్య‌క‌లాపాలు, వారి జీవితాల‌పై అవి ఎలా ప్ర‌బావం చూపుతున్నాయ‌నేది సభ్యుల‌నుండి నేరుగా తెలుసుకునేందుకు ఇష్టాగోష్టి ప్ర‌ధాన‌మంత్రి కి అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చు. దూర‌ద‌ర్శ‌న్‌, ఆకాశ‌వాణి,  ఎన్ ఐసీ వెబ్‌కాస్ట్‌పై ఈ ఇష్టాగోష్టి అందుబాటులో ఉంటుంది. ఎంపికైన కొంద‌రు ల‌బ్దిదారులు మద్యం వ్య‌తిరేక ఉద్య‌మం, బీహార్ నుంచి మొక్క జొన్న విలువ‌, మార్కెటింగ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి ఇటుక త‌యారీ యూనిట్‌, బిజినెస్‌క‌ర స్వాండెంట్ స‌ఖి, చింత పండు విలువ‌, మార్కెటింగ్‌, జార్ఖండ్ నుంచి ఒక ల‌బ్దిదారు ప‌ని చేస్తున్నారు. దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న‌- జాతీయ గ్రామీణ బ‌తుకుతెరువు మిష‌న్ ద్వారా  గ్రామీణ దారిద్ర్య నిర్మూల‌న‌పై ప్ర‌భుత్వం కేంద్రీక‌రిస్తున్నంద‌ని, దీనికి స్వ‌యం స‌హాయ బృందాలు పెద్ద ఎత్తున దోహ‌దం చేస్తున్నాయ‌ని గ్రామీణాభివృద్ది మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ఆకాశ‌వాణికి చెప్పారు. ఇంత‌వ‌ర‌కు దేశంలో 45 ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయ‌క బృందాలున్నాయ‌ని, ఈ మిష‌న్‌తో ఐదు కోట్ల మందికి పైగా మ‌హిళ‌ల‌కు సంబంధం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. 9 కోట్ల కుటుంబాల‌ను ఈ స్వ‌యం స‌హాయ బృందాల‌లో చేర్పించి, వారిని నిల‌క‌డైన బ్ర‌తుకు తెరువు అవ‌కాశాల‌తో అనుసంధానం చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని తోమ‌ర్ చెప్పారు. గ్రామీణ అభివృద్ధితో పాటు, స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ వంటి అనేక ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్రోత్స‌హించ‌టంలో, అమ‌లు చేయ‌డంలో ఈ బృందాలు ముఖ్య‌మైన పాత్ర పోషిస్టున్నాయ‌ని మంత్రి చెప్పారు. దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ ప్రాంతాల నుండి ఐదు ల‌క్ష‌ల 70 వేల మందికి యువ‌జ‌నుల‌కు శిక్ష‌ణ‌నిచ్చిన‌ట్టు, 3 ల‌క్ష‌ల 54 వేల మందికి పైగా యువజ‌నుల‌కు ఉద్యోగాలు పొందిన‌ట్లు తోమ‌ర్ చెప్పారు. దీన్‌ద‌యాళ్ అంత్యోద‌య అంత్యోద‌య యోజ‌న‌,  జాతీయ గ్రామీణ బ్ర‌తుకుతెరువు మిష‌న్‌, దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య మోజ‌న ద్వారా గ్రామీణ భార‌త ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు తేవాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న చెప్పారు.