ఇండియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్ లో ఈ మధ్యాహ్నం రెండోటెస్టు ప్రారంభమవుతుంది.

క్రికెట్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లో రెండో టెస్టు లండన్ లో లార్డ్స్ లో ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. 1-0 స్కోరుతో ఇంగ్లండ్ ప్రస్తుతం ఈ సిరీస్ లో ఆధిక్యతతో ఉంది. బర్మింగ్ హాంలో మొదటి టెస్టులో 31 పరుగులతో వారు విజయం సాధించారు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కోర్టు విచారణ కారమఁగా వెళ్లిపోవడంతో ఇంగ్లండ్ కు ఆయన సేవలు అందడం లేదు. ఆయన స్థానంలో క్రిస్ వోక్స్ ను పిలిచారు. బ్యాట్స్  మ్యాన్ గిల్లీ ఈరోజు తొలిసారి ఆడతారని భావిస్తున్నారు.