క్విట్ ఇండియా ఉద్య‌మం 76వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ రోజు ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఇవాళ క్విట్ ఇండియా ఉద్యమ‌ 76వ వార్షికోత్స‌వం. బ్రిటిష్ పాల‌కుల‌ను త‌రిమికొట్టే దిశ‌గా చావోరేవో తేల్చుకుందామంటూ 1942లో స‌రిగ్గా ఇదే రోజున మ‌హాత్మాగాంధీ భార‌తీయులంద‌రికీ పిలుపునిచ్చారు. ముంబైలోని గ‌వాలియా చెరువు వ‌ద్ద‌నుంచి ఈ ఉద్య‌మం మ‌హోధృతంగా మొద‌లైంది. దీన్ని ఏటా “ఆగ‌స్టు విప్ల‌వ దినం”గా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భాన్ని స్మ‌రించుకుంటూ ఇవాళ రాత్రి ఆకాశ‌వాణి వార్తా విభాగం “న‌వ భార‌తం-స్వాతంత్య్ర ఔచిత్యం” ఇతివృత్తంతో నిర్వ‌హించే రేడియో బ్రిడ్జి కార్య‌క్ర‌మం రెండు భాష‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారమ‌వుతుంది. దీన్ని FM GOLD చానెల్‌లో రాత్రి 9:30 గంట‌ల‌నుంచి విన‌వ‌చ్చు. ఆకాశ‌వాణిలోని నిపుణుల‌తోపాటు ముంబై, చెన్నై, గువ‌హ‌టి, జైపూర్‌, జ‌మ్ము, ల‌క్నోల నుంచి నిపుణులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.