ఫేస్ బుక్ నుంచి సమాచారం దొంగిలించిన కేసులే కేంబ్రిడ్జి అనలిటికా పైన CBI దర్యాప్తు ప్రారంభించింది.

ఫేస్ బుక్ నుంచి భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా తీసుకున్నారన్న ఆరోపణపై బ్రిటిష్ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా అండ్ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ కు వ్యతిరేకంగా CBI ప్రాథమిక విచారణ ప్రారంభించింది. కేంద్రం నుంచి ప్రస్తావన అందాక ఈ సంస్థ ప్రాథమిక విచారణ ప్రారంభించిందని అధికారులు చెప్పారు. ఆరోపణలపై ఫేస్ బుక్ పై పూర్తిస్థాయి విచారణ అవసరమా.. కాదా… అని నిర్ణయించేందుకు మామూలుగా ఇది తొలిచర్య అని అధికారులు పేర్కొన్నారు. సమాచారం వెల్లడైనట్లు వెలుగులోకి వచ్చాక ఈ అంశంపై విచారణ కోరుతూ IT మంత్రిత్వ శాఖ మార్చి, ఏప్రిల్ లో ఫేస్ బుక్ కు, కేంబ్రిడ్జి అనలిటికాకు లేఖలు రాసింది.