NDA అభ్యర్థి హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా NDA అభ్యర్థి హరివంశ్ ఎన్నికయ్యారు. రాజ్యసభలో ఈరోజు డిప్యూటీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికలో హరివంశ్ కు 125 ఓట్లు, హరిప్రసాద్ కు 105 ఓట్లు లభించాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ ఎన్నికయ్యారని ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. సభా నాయకుడు అరుణ్ జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ తోడ్కొనిరాగా హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్ గా తన స్థానంలో ఆశీనులయ్యారు. ప్రముఖ జర్నలిస్టు హరివంశ్ JDU సభ్యునిగా ఉన్నారు.