కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో 26 మంది మరణించారు

కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో 26 మంది మరణించారు. భారీ కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో 26 మంది వరదల వల్ల, కేరళలో భారీ నష్టం సంభవించింది. ఉత్తరాది జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాకు. వివిధ డ్యామ్ లతో నిటి మట్టం గరిష్ట స్థాయిని చేరుకోవడంతో కనీసం 24 రిజర్వాయర్ల గేట్లను ఆ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఎత్తివేసి నీటిని కిందకు వదుల్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. అనేక రోడ్లు కొట్టుకో పోయాయి. మరికొన్ని నీట మునగడంతో పలు జిల్లాలో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఇడుక్కి, వయనాడ్ లలో కొండచరియలు భారీ చెట్లు కూకటివేళ్లతో పెకలించుకుపోవండంతోట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. జాతీయ విపత్తు స్పందని దళాలు, సైన్యం, సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.