జె.కేలో ఫూంచ్ జిల్లాలో భద్రతా దళాలు – తీవ్రవాదుల రహస్య స్థావరం ఛేదించి, పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి.

జమ్ముకశ్మీర్ లో ఫూంచ్ జిల్లాలో భద్రతా దళాలు – తీవ్రవాదుల రహస్య స్థావరం ఛేదించి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి. దీని గురించి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్ ఉమ్మడి బృందం నిన్న ఛాప్రియాన్ ప్రాంతంలోని కథ్ పంజల్ నాలాలో గాలింపు చేపట్టి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకుంది. ఒక ఎకె 56 రైఫిల్, 3 యెగిజైన్లు, ఒక విదేశి 7.62 రైఫిల్, 4 పిస్తోళ్లు, 7 ఖాళీ మెగిజైన్ లు, ఒక రివాల్వర్, 4 ఖాళీ ఎకె 47 మెగిజైన్లు, 14 గ్రైనేడ్ లు, ఎకె 47 రైఫిల్ , 273 రౌండ్లు తదితర అనేక ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ తెలిపింది.