దేశంలో ప్రతి గ్రామానికి జీవ ఇంధన ప్రయోజనాలు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.

దేశంలో ప్రతి గ్రామానికి జీవ ఇంధన ప్రయోజనాలు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కొత్త ఢిల్లీలో ఈ రోజు 2018 ప్రపంచ జీవ ఇంధన దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. జీవ పదార్థాలను జీవ ఇంధనంగా మార్చేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో పెట్టుడులు పెడుతోందని 10 వేల అధునిక రిఫైనరీలు ప్రారంభించడానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందుపల్ల 1 లక్షా 50 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాని చెప్పారు. జీవ  ఇంధనం ఉపయోగించడం వల్ల రైతుల జీవితాలలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. ఇధనాల్ వాడకం వల్ల పెద్ద మొత్తంలో బడ్డు ఆదా అవుతుందని అంటే ప్రధానమంత్రి పెట్రోల్ ఇథనాల్ మిశ్రమాన్ని 2022 కల్లా 10 శాతానికి 2030 కల్లా 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.