ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం 2018 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ రోజు కొత్త ధిల్లీలో రైతులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ రోజు 2018 ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, చట్టసభ్యులు మొదలైన వివిధ రంగాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జీవ ఇంధనం, ముడి చమురు  దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సహాయ పడుతుంది. ఈ జీవ ఇంధనాలు వాతావరణాన్ని శుభ్రపరుస్తాయి. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి. జీవ ఇంధన రంగంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలను తెలియజేస్తూ జీవ ఇంధన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని పాటిస్తున్నారు.