మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు 3 రోజుల నుంచి చేస్తున్న సమ్మెను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలిస్తామని హామి ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు.

మహారాష్ట్ర ప్రభుత్వోద్యోగులు తమ డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం నుంచి హామీ అందడంతో మూడు రోజుల పాటు జరప తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో నిన్న జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.కె.జైన్ ఏడవ వేతన సంఘం డిమాండ్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని హామి ఇచ్చారు. కాగా ఏడవ వేత సంఘం బకాయిలు- 2016 నుంచి, డియర్నెస్ అలవెన్స్ గత 14 నెలల నుంచి చెల్లించాలని సంఘం కోరింది. ఈ సమావేశం తరువాత మరాఠా కమ్యూనిటీ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సంఘం తాము జరప తలపెట్టిన సమ్మెను విరమించింది. దీంతో నిత్యావసర, వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం కలగలేదు.