రాజ్యసభ ఆమోదం కోసం ఈరోజు ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వ ప్రవేశపెడుతుంది.

రాజ్యసభ ఆమోదం కోసం ఈరోజు ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వ ప్రవేశపెడుతుంది. లోక్ సభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లులో 3 సవరణలు ప్రతిపాదించారు. విచారణకు ముందు నిందితుడికి బెయిల్ నిబంధనతో పాటు త్రిపుల్ తలాక్ లో కొన్ని సవరణలను కేంద్ర క్యాబినేట్ ప్రతిపాదించింది. కొత్త డిల్లీలో కేబినెట్ సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ.. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివాహ బిల్లులో ముస్లిిం మహిళల పరిరక్షణ హక్కులకు 3 సవరణలను కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి లోక్ సభ ఆమోదం తెలిపింది.

ముమ్మారు తలాక్ బిల్లును ముస్లిం మహిళలకు సామాజిక న్యాయ చట్టంగా మైనరిటీ వ్యవహారాల  శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి అభివర్ణించారు. ముస్లిం మహిళల రాజ్యాంగ హక్కుల పటిష్టత లక్ష్యంగా ఈ బిల్లు ఉంది. ఈ చట్టం దురుపయోగం కాదని నక్వి స్పష్టం చేశారు.