హొ చిమి మించ్ నగరంలో జరుగుతున్న వియాత్నం ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత షట్లర్లు అజయ్ జయరామ్, రితుపర్ల దాస, మితున్ మంజూనాథ చేరుకున్నారు.

భారత బాడ్మింటన్ షెట్లర్లు అజయ్ జయరామ్, రితుపర్నదాస్, మిథున్ మంజునాథ్ లు నిన్న హోచి మించ్ సిటీలో జరిగిన వియాత్నం ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. తన కెరీర్ లో 13వ ర్యాంకుకు చేరుకున్న జయరామ్ బ్రెజిల్ కు చెందిన యగర్ కోల్హో ను 22-20, 21-14 స్కోరుతో ఓడించారు. మాజీ జాతీయ ఛాంపియన్ రితుపర్ణ – చైనాకు చెందిన 6వ సీడ్ షుంగ్ షుయున్ ను 21-8, 21-14 స్కోరుతో ఓడించారు. గత నెల రష్యన్ ఓపెన్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్న మంజునాథ్ థాయ్ లాండ్కు చెందిన అదులారఖ్ నామ్కుల్ ను 18-21, 21-13, 21-19 స్కోరుతో ఓడించారు.