ఢాకోల జరుగుతున్న దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్య ఛాంపియ్ షిప్ ఫైనల్లో శనివారం ఇండియా మాల్డీవ్స్ తో ఆడుతుంది.

ఢాకాలో జరిగే దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్య ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో భారత్ జట్టు మాల్దీవుల జట్టుతో తలపడుతుంది. గత రాత్రి ఢాకాలోని బంగబంధం స్టేడియంలో జరిగిన రెండవ సెమీ ఫైనల్ పోటీలో భారత జట్టు పాకిస్తాన్ జట్టును 3-1 గోల్స్ తేడాతో ఓడించింది. అంతకు ముందు జరిగిన మొదటి సెమీ ఫైనల్స్ పోటీలో మాల్దీవుల జట్టు నేపాల్ జట్టును 3-0 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్స్ కు చేరింది. ప్రస్తుతం ఛాంపియన్ గా ఉన్న భారత జట్టు గతంలో ఏడు సార్లు ఈ టైటిల్ ను గెలుచుకుంది.