దేశవ్యాప్తంగా ఈ రోజు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సవాహాలతో జరుపుకుంటున్నారు.

దేశ వ్యాప్తంగా ఈ రోజు వినాయక చవితి జరుపుకుంటున్నారు. ఇళ్లలో పూజలతో పాటు వాడ వాడలో మండపాల్లో వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. అంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో అత్యంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలపైనా విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మధ్య ఈ ఉత్సవాలు సంఘీభావాన్ని కలిగిస్తాయని రాంనాథ్ కోవింద్ తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజలకు శాంతి, సంతోషం, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకున్ని జ్ఞానానికి, సిరి సంపదలకు మంచి భవిష్యత్తుకూ మరో రూపంగా కొలుస్తారని ఉప రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ దేశంలో శాంతి, సౌభాగ్యం, సామరస్యాలను నెలకొల్పగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.