.పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రధానమంత్రి అన్నదాత ఆయోజ్ సంరక్షణ అభియాన్ అనే కొత్త పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.

ప్రధానమంత్రి అ్నదాత ఆయ సంరక్షణ అభియాన్ పి.ఎం.అశా అనే కొత్త పథకాన్ని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. 2018 బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం పథకం లక్ష్యం. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, ప్రభుత్వ రైతు అనుకూల చర్యలకు ఆ పథకం ప్రధాన ప్రోత్సాహకమి చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే యంత్రాంగాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. రైతు సంక్షేమ పథకాలకు తోడు రైతుల ఆదాయం పెంచడానికి ఆ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.