ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ రోజు మేరా బూత్ సబ్సే మజ్ బూత్ సంవాద్ అనే కార్యక్రమం కింద వీడియో కాన్ఫరెన్స ద్ారా బిజెపి కార్యకర్తలతో మాట్లాడుతారు

మేరా బూత్, సబ్సే మజ్ బూత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అరుణాచల్ వెస్ట్, ఘజియాబాద్, హజారీబాగ్, జయపూర్ రూరల్, నవాడ పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని బిజెపి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటిస్తారు. ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు ఈ ఉదయం 11 గంటలకు నరేంద్రమోడీ యాప్ ద్వారా ప్రధానమంత్రితో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేశారు కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆరోగ్య లబ్దిదారులతో ముచ్చటించారు.