విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ర‌ష్యా వెళ్లారు. మాస్కోలో సాంకేతిక ఆర్థిక స‌హ‌కారంపై ఇండియా, ర‌ష్యా అంత‌ర్‌ ప్ర‌భుత్వ సంఘం 23 వ స‌మావేశాల‌కు అధ్య‌క్ష‌త వ‌హిస్తారు.

వ భార‌త్‌-ర‌ష్యా సాంకేతిక‌ఆర్థిక స‌హ‌కారంపై ప్ర‌భుత్వ క‌మిష‌న్ స‌మావేశం జ‌రిపేందుకు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ రెండు రోజుల మాస్కో ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించారు. ర‌ష్యా ఫెడ‌రేష‌న్ ఉప ప్ర‌ధాన‌మంత్రి యూరి బారిసోల్‌తో క‌లిసి స‌మావేశానికి స‌హ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. ద్వైపాక్షిక వ్యాపారంపెట్టుబ‌డిశాస్త్ర సాంకేతిక ప‌రిజ్ఞానంసంస్కృత రంగాలుప‌ర‌స్ప‌రం ఆస‌కి్త గ‌ల ఇత‌ర అంశాల్లో కొన‌సాగుతున్న ద్వైపాక్షిక స‌హ‌కారం కార్య‌క‌లాపాల‌పై స్థాయీ సంఘం ప్ర‌తిఏటా స‌మావేశ‌మై స‌మీక్షిస్తుంది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని స‌మీక్షంచాక ఈ క‌మిష‌న్ సంబంధిత రంగాల్లో విధాన‌ప‌ర‌మైన సిఫార్సులుఆదేశాలు ఇస్తుంది. ఈ క‌మిష‌న్ గ‌త స‌మావేశం డిసెంబ‌ర్ లో కొత్త ఢిల్లీలో జ‌రిగింది.