స‌బ్‌కాసాత్‌.. స‌బ్‌కా వికాస్ కేంవంలం నినాదం కాదని, ప్ర‌తి భార‌తీయ‌ని అభివృద్ధికి అది స్ఫూర్తిమంత్ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చెప్పారు. దేశ అభివృద్ది కోసం కృషి కొన‌సాగించాల‌ని ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు.

స‌బ్‌కాసాత్ స‌బ్‌కా వికాస్ కేవలం ఒక నినాదం మాత్ర‌మే కాద‌ని ప్ర‌తి   భార‌తీయు అభివృద్ధికి అది స్ఫూర్తి మంత్ర‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చెప్పారు. ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ఓటు బ్యాంకు  రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని బీజెపి మాత్రం ప్ర‌తి భార‌తీయునికి స‌మాన అవ‌కాశం కోసం పాటుప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. మేరా బూత్‌. స‌బ్‌సే  మ‌జ్‌బూత్ సంవాద కార్య్ర‌క‌మంలో ప్ర‌ధాని ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా బీజేపీ కార్య‌క‌ర్త‌లో మాట్లాడారు. అరుణాచ‌ల్ వెస్ట్. ఘ‌జియాబాద్‌, హ‌జారీబాద్‌,  జైపూర్ రూర‌ల్‌, న‌వాడా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల కార్య‌కర్త‌లు ఇందులో పాల్గ‌న్నారు.పార్టీ కార్య‌కర్త‌లు దేశ అభివృద్ధి కోసం త‌మ కృషి కొన‌సాగించాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.