అర్జెంటీయాలోని మ‌ర్ డెల్ ప్లాట‌లో జీ-20 వాణిజ్య‌, పెట్టుబ‌డుల మంత్రుల స‌మావేశంలో భార‌త వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి సురేష్ ప్ర‌భు పాల్గొంటారు.

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు మూడు దేశాల ప‌ర్య‌ట‌న‌కై సెర్బియా, మాల్టా, రొమానియాల‌కు ఈ రోజు బ‌య‌లుదేరి వెళ‌తారు. త‌న ఏడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న మొద‌టి సెర్బియా చేరుకుని ఆదేశ నాయ‌క‌త్వంతో స‌మావేశం అవుతారు. ఈ వివ‌రాల‌ను కొత్త ఢిల్లీలో విలేక‌రుల‌కు తెలుపుతూ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి డా. అంజు కుమార్ ఈ దేశాల‌లో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వ్య‌వ‌సాయం, ప‌ర్యాట‌కం త‌దిత‌ర రంగాల‌లో అనేక అవ‌గాహ‌న ప‌త్రాల‌పై సంత‌కాలు జ‌రుగుతాయ‌న్నారు. ఆదివారంనాడు వెంక‌య్య‌నాయుడు మాల్టా చేరుకుని ఆదేశ నాయ‌క‌త్వంతో ప‌ర‌స్ప‌ర ఆస‌క్తిగ‌ల అంశాల‌పై చ‌ర్చిస్తారు. ఇరు దేశాల మ‌ధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయి. మాల్టా లో భార‌త ఐటీ కంప‌నీల‌కు మంచి అవ‌కాశాలు ఉన్నాయియి. ఆ దేశానికి ఐటీ సొల్యూష‌న్స్‌ల‌ను అందించ‌గ‌లుగుతాయి. వెంక‌య్య‌నాయుడు ఈ నెల 18వ తేదీన రొమానియా సంద‌ర్శిస్తారు. ఈ యూరోపియ‌న్ దేశాల‌తో భార‌త్‌కు  చారిత్రాత్మ‌క సంబంధాలు ఉన్నాయి. వెంక‌య్య‌నాయుడు ప‌ర్య‌ట‌న ద్వారా ఈ దేశాల‌తో ద్వైపాక్షిక సంబంధాలు బ‌లోపేతం అవుతాయి.