ఇండోర్‌లో ఈ రోజు దావూదీ బొహ్రా స‌మాజం నిర్వ‌హించే అషారాముబారకా కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పాల్గొంటారు

షియా వర్గం ముస్లిములకు చెందిన దావూదీ  బోహ్రా సమాజం ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జ‌రిగే అషారా ముబారకా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. ఇమామ్ హుస్సేన్ బలిదాన్ని స్మరిస్తూ ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం సందర్భంగా, దావూదీ బోహ్రా మతానికి చెందిన 53వ గురువు డాక్టర్ సయ్యదానా ముఫద్దాయ్ సైఫుద్దీన్ ను కూడా ప్రధాని మోదీ కలుసుకుంటారు. ఇండోర్ లోని సైఫీ నగర్ మసీదులో డాక్టర్ సైఫుద్దీన్  గత బుధవారంనుంచి 9 రోజుల మత ప్రవచనాలను అందిస్తున్నారు. ఈ పర్యటనలో దావూదీ బోహ్రా సభ్యులనుద్దేశించి  ప్రధాని మోదీ ప్రసంగిస్తారని,  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారని మా విలేకరి తెలియజేస్తున్నారు.