జ‌మ్మూకాశ్మీర్‌లో కిష్ట‌నాగ్ జిల్లాలో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో 11 మంది మర‌ణించారు.

జమ్ము,, కాశ్మీర్ లోని క్షిత్వార్ జిల్లాలో   చేనాబ్ నదిలో ఈరోజు   ఒక మినీబస్సు పడి  11 మంది మరణించారు. మరో  13 మంది గాయపడ్డారు.    ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు  సహాయ, రక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయని   క్షిత్వార్   డిప్యూటీ కమిషనర్    ఆంగ్రేజ్ సింగ్ రాణా తెలిపారు.  ఇంతవరకూ 11 మృత దేహాలను వెలికి తీసినట్టు ఆయన చెప్పారు.  గాయపడిన 13 మందిని జిల్లా ఆస్పత్రిలో చేర్చించినట్టు ఆయన చెప్పారు. ఈ మినీ బస్సులో  25 నుంచి 30 మంది ఉన్నారనీ, కేష్వాన్ నుంచి క్షిత్వార్ కి వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదానికి లోనైందని     పోలీసులు తెలిపారు.