దేశ‌వ్యాప్తంగా ఈరోజు హిందీ దివ‌స్‌ను జ‌రుపుకుంటున్నారు.

ఈ రోజు దేశవ్యాప్తంగా హిందీ దివస్ ని జరుపుకుంటున్నారు. 1949లో సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ సభ దేవనాగరి లిపిలో   హిందీని అధికార భాషగా గుర్తించింది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు  ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు రాజ్యభాషా అవార్డులను ప్రదానం చేస్తారు.  అధికార కార్యకలాపాలను హిందీలో సాగిస్తున్నందుకు గుర్తింపుగా ఈ  అవార్డులను ప్రదానం చేస్తారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్్ ఈ సందర్భంగా జరిగే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.  ఈ కార్యక్రమానికి హోం శాఖ సహయ మంత్రులు హన్స్ రాజ్ అహిర్,  కిరణ్ రిజజు హాజరవుతారు.