మాస్కోలో ఈ రోజు జ‌రిగే 23వ సాంకేతిక‌, ఆర్థిక స‌హ‌కార అంత‌ర్ ప్ర‌భుత్వ క‌మిష‌న్ స‌మావేశంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ర‌ష్యా స‌మాఖ్య డిప్యూటీ ప్ర‌ధాన‌మంత్రి యున్ బొరిసోవ్‌తో క‌లిసి స‌హ అధ్య‌క్ష‌త వహిస్తారు.

మాస్కోలో ఈ రోజు జ‌రిగే 23వ సాంకేతిక‌, ఆర్థిక స‌హ‌కార అంత‌ర్ ప్ర‌భుత్వ క‌మిష‌న్ ఐఆర్ ఐజీసీ-టీఈసీ స‌మావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ర‌ష్యా స‌మాఖ్య డిప్యూటీ ప్ర‌ధాన‌మంత్రి యురి మొరిసోవ్‌తో క‌లిసి స‌హ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. ధ్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబ‌డులు, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, సంస్కృతి త‌దిత‌ర రంగాల‌లో సాగుతున్న ధ్వైపాక్షిక స‌హ‌కారాన్ని స‌మీక్షించేందుకు ప్ర‌తి సంవ‌త్స‌రం స‌మావేశ‌మ‌య్యే సంఘ‌మే ఐఆర్ ఐజీసీ-టీఈసీ. వివిధ రంగాల‌లో ధ్వైపాక్షిక స‌హ‌కారం స‌మీక్షించాక ఈ క‌మిష‌న్ సంబంధిత రంగాల‌కు విధాన‌ప‌ర సిఫార్సులు, దిశానిర్దేశం అందిస్తుంది. సుష్మాస్వ‌రాజ్ నిన్న మాస్కోకు చేరుకున్నారు. ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ  లావ్‌రొర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఇరువురు నాయ‌కులు ధ్వైపాక్షిక‌, ప్రాంతీయ అంశాల‌పై ప‌ర‌స్ప‌రం మంచి అభిప్రాయాలు తెలుపుకున్నార‌ని భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి ర‌వీష్ కుమార్ ట్వీట్ చేశారు. సుష్మాస్వ‌రాజ్ గౌర‌వార్ధం ర‌ష్యా విదేశాంగ మంత్రి విందునిచ్చారు. అంత‌కుముందు సుష్మా స్వ‌రాజ్ ర‌ష్యాకు వెళుతూ అష్గాభ‌ట్‌లో ఆగి తొర్కిమినిస్తాన్ విదేశాంగమంత్రితో చ‌ర్చ‌లు జ‌రిపారు. ధ్వైపాక్షిక అంశాల‌పై చ‌ర్చించారు.