జమ్ము కశ్మీర్ లో ని పట్ట స్థానిక సంస్థలకు రెండో విడత ఎన్నికల పోలింగ్ ను ఇవాళ నిర్వహిస్తారు.

జమ్ము కశ్మీర్ లోని పట్టణ స్థానిక సంస్థలకు రెండో విడత ఎన్నికల పోలింగ్ ను ఇవాళ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి షాలీన్ కాబ్రా ఈ మేరకు నిన్న శ్రీనగర్ లో విలేకరులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 544 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటల దాకా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆయన వివరించారు. ఈ పోలింగ్ కేంద్రాలలో 270 కశ్మీర్ డివిజన్ లోనూ, 274 జమ్ము డివిజన్ లో ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదుల పరిష్కారం కోసం అన్ని పురపాలికలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఈ కంట్రోల్ రూమ్ ల ద్వారా ప్రజలకు అందిస్తామని తెలిపారు. కాగా, రాష్ట్రంలో పురపాలకు ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా సాగేలా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు 400 పటాలాల కేంద్ర భద్రత బలగాలను అదనంగా మోహరించినట్లు పేర్కొన్నారు.