బంగాళాఖాతం ప‌శ్చిమ దిశ‌లో ఏర్ప‌డిన తిత్లీ త‌ఫాన్ తీవ్ర‌మైన త‌ఫానుగా ఉదృత‌మైంది.

ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాత‌లో క‌చ్చిత‌మైన తిత్లీ తుఫాను ఈరోజు తీవ్ర తుఫానుగా ఉధృత‌మైంది. ఇది మ‌రింత ఉధృత‌మై రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవ‌కాశం ఉంది. ఇది ఉత్త‌ర – వాయువ్యం వైపు క‌దులుతోంది. ఇది ఒడిషా తీర‌ప్రాంతం స‌మీప ఉత్త‌ర ఆంధ్రాప్రాంతం తీరాన్ని గోపాల్‌పూర్‌, క‌ళింగ‌ప‌ట్నం మ‌ధ్య రేపు ఉద‌యానికి దాటే అవ‌కాశం ఉంది. తుఫాన్ ప్ర‌భావం కార‌ణంగా ఒడిషాలోని ప‌లు తీర‌ప్రాంతాలు, త‌దిత‌ర ప్రాంతాల‌లో ప్ర‌స్తుం వ‌ర్షం కురుస్తోంది. భువ‌నేశ్వ‌ర వాతావ‌ర‌ణ కేంద్రం నుంచి అందిన స‌మాచారం మేర‌కు గంట‌కు 60 నుంచి 70 కిలోమీట‌ర్ల వేగంతో వీస్తున్న గాలులు 80 కిలోమీట‌ర్ల‌కు పె రిగి ఈ సాయంత్రానికి ఒడిషా తీరం వెంబ‌డి వీటి తాకిడి ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం జ‌గ‌త్ సింగ్‌పూర్‌, కేంద్రపారా, ఖుర్దా, గంజా, పూరి, గ‌జ‌ప‌తి న‌గ‌రాల‌లో ఒక మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. శుక్ర‌వారం వ‌ర‌కు వ‌ర్షం కొన‌సాగుతుంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలియ‌జేసింది.