ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తిలోని , ఒడిస్సాలో బెరంపూర్‌లోనూ భార‌త విజ్ఙాన శాస్ర్త విద్యా ప‌రిశోధ‌న సంస్థ‌(ఐఐఎస్ఈఆర్‌) రెండు నూత‌న శాశ్వ‌త‌ క్యాంప‌స్‌ల నిర్మాణానికి కేంద్ర మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తిలోని , ఒడిస్సాలో బెరంపూర్‌లోనూ భార‌త విజ్ఙాన శాస్ర్త విద్య ప‌రిశోధ‌న సంస్థ‌(ఐఐఎస్ఈఆర్‌) రెండు నూత‌న క్యాంప‌స్‌ల  నిర్మాణానికి కేంద్ర మంత్రి మండ‌లి ఆమోదం తెలిపింది. ఆ రెండు క్యాంప‌స్‌ల నిర్మాణం 2021, డిసెంబ‌రుకు పూర్త‌వుతుంద‌ని,  3 వేల 74 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతాయ‌ని అధికార ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, స‌మీకృత పీహెచ్‌డీ కోర్సుల ద్వారా ఆ సంస్థ‌ల్లో విజ్ఙాన‌శాస్ర్తంలో నాణ్య‌మైన విద్య‌నందిస్తారు. విజ్ఙాన‌శాస్ర్తంలో  ప‌రిశోధ‌న‌ల‌కు కూడా మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు. ఆ విధానాన్ని మంత్రి మండ‌లి ఆమోదం కోసం పంపిస్తున్నామ‌ని చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న సీఐఎస్ఎఫ్‌- CISF స్వ‌ర్ణోత్స‌వాల్లో మాట్లాడుతూ  మంత్రి ఎయిర్‌కార్గో విధానంతో విమాన‌యాన రంగం అభివృద్ధి చెందుతోంద‌ని, దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు ఊతమిస్తుంద‌ని చెప్పారు. విమానాల ద్వారా వ్య‌వ‌సాయ దిగుబ‌డులు  ర‌వాణా జ‌ర‌గ‌టంతో రైతులు ఆదాయం పెరుగుతోంద‌ని మంత్రి తెలిపారు.