తిత్లీ తుపాన్ ఈ ఉద‌యం ఒడిశాలో గోపాల్‌పూర్ వ‌ద్ద తీరం దాటింది. మూడు ల‌క్ష‌ల మందిని స‌హాయ శిబిరాల‌కు త‌ర‌లించారు.

పెను విల‌యం సృష్టించే దిశ‌గా క‌దులుతున్న తిత్లీ తుపాన్ ఒడిశాలోని గోపాల్ పూర్ స‌మీపానికి ఈ ఉద‌యం తీరానికి దాటింది. స‌రిహ‌ధ్దు జిల్లా అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళంలో ఈ తుపాన్ తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. తుపాన్ తీవ్ర‌త మ‌రింత ఉధృతం కావ‌డంతో ఒడిశాలోని ప‌లు ప్రాంతాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం ఏదీ లేదు. మూడు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌ను లోత‌ట్టు ప్రాంతాల నుంచి బ‌హుళ ప్ర‌యోజ‌నాల తుపాన్ ర‌క్ష‌ణ కేంద్రాల‌కు త‌ర‌లించారు. ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌త్యేక స‌హాయ క‌మీష‌న‌ర్ కంట్రోల్ రూంను సంద‌ర్శించారు. మ‌ర‌ణాలు సంభ‌వించ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఇలా ఉండ‌గా జాతీయ‌ విప‌త్తు స్పంద‌న ద‌ళం ఎన్‌డిఆర్‌.ఎఫ్ ఒడిషాకు 14 బృందాల‌ను త‌ర‌లించింది. నాలుగు బృందాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, మూడు బృందాల‌ను ప‌శ్చిమ‌బెంగాల్‌కు త‌ర‌లించారు. అవ‌స‌ర‌మైన ర‌క్ష‌ణ ప‌రిక‌రాల‌ను కూడ ఈ ప్రాంతాల‌కు పంపించారు.