విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ షాంగ‌యి స‌హ‌కార సంస్థ స‌మావేశాల్లో పాల్గొన‌డానికి తాజికిస్తాన్ వెళ్లారు.

విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఈరోజు తాజికిస్తాన్‌లో ప్రారంభ‌మ‌య్యే షాంగై స‌హ‌కార సంస్థ – ఎస్‌.సి.ఓ ప్ర‌భుత్వాధి నేత‌ల మండ‌లి రెండు రోజుల స‌మావేశంలో పాల్గొనేందుకు దుషాన్‌బి బ‌య‌లుదేరి వెళ్ళారు. సుష్మాస్వ‌రాజ్ ప‌రిమిత‌, విస్తృత స్థాయి స‌మావేశాలు రెండింటిలో పాల్గొన‌నున్నారు. షాంగై స‌హ‌కార సంస్థ ప్ర‌భుత్వాధినేత‌లు, స‌భ్య దేశాల స‌మావేశంలో ఆమె పాల్గొన‌డం ద్వారా భార‌త్ ఈ వేదిక‌లో పాల్గొంటోంది. ఆఫ్ఘ‌నిస్తాన్‌, బెవార‌స‌, ఇరాన్‌, మంగోలియా దేశాల‌తో భార‌త్ స‌త్సంబంధాలు కొన‌సాగించ‌డానికి ఈ రెండు రోజుల స‌మావేశం దోహ‌ద‌ప‌డుతుంది. ఈ సంస్థ అధ్య‌క్ష ప‌ద‌విని కిర్గిస్థాన్ చేప్ట‌టిన త‌రువాత జ‌రుగుతున్న తొలి స‌మావేశం ఇదే. సంస్థ తదుప‌రి అభివృద్ధి అవ‌కాశాల‌తో పాటు విస్తృత‌ అంత‌ర్జాతీయ ప్రాంతీయ అంశాల‌ను లోతుగా చ‌ర్చించి, ప‌ర‌స్ప‌రం అభిప్రాయాల‌ను నాయ‌కులు ఈ సమావేశంలో మార్పిడి చేసుకుంటారు.  2017లో భార‌త్ ఈ సంస్థ‌లో పూర్థిస్థాయి స‌భ్య‌త్వం పొందింది.