అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో అద్భుత విజ‌యం ల‌భించింద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ అన్నారు. భార‌త్‌, అమెరికా సంత‌తికి చెందిన న‌లుగురు డెమోక్రాటిక్ పార్టీ త‌ర‌పున తిరిగి ఎన్నిక‌య్యారు.

అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌లో న‌లుగురు భార‌త సంత‌తి కాంగ్రెస్ అభ్య‌ర్థులు డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌తినిధుల స‌భ‌కు  తిరిగి ఎన్నిక‌య్యారు. దేశ వ్యాప్తంగా గ‌ల వివిధ‌జాతుల‌కు  చెందిన అభ్య‌ర్థులు డ‌జ‌న్‌కుపైగా గెలిచారు. కాంగ్రెస్ ప్ర‌భావిత ఇల్లినోయిస్ నుంచి రాజా కృష్ణ‌మూర్తి తిరిగి ఎన్నిక‌య్యారు. మూడు సార్లు సేవ‌లు అందించిన డాక్ట‌ర్ అమిబెర కాలిఫోర్నియా నుంచి నాలుగో సారి విజ‌యం సాధించారు. సిలికాన్ వాలిలో భార‌త్‌-అమెరికా సంత‌తికి రోశ‌న్న‌- రిప‌బ్లిక్ పార్టీకి చెందిన రాస్ కోహిస్‌ను ఓడించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి  ప్ర‌పాల జ‌య‌పాల్ త‌మ స‌మీప ప్ర‌త్య‌ర్థి క్రైగ్ కెల్ల‌ల్‌ను 66 శాతం పాయింట్ల తేడాతో ఓడించారు.  భార‌త్ అమెరికా  సంత‌తి రాష్ర్టాల శాస‌న‌స‌భ‌ల్లోనూ బ‌లం పుంజుకుంది.