జింబాబ్వేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 47 మంది మృతిచెందారు.

జింబాబ్వే రాజధాని హరారే తూర్పు పట్టణం రుసాపె మధ్య రహదారిలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 47 మంది దుర్మరణం పాలయ్యారు. మృతిచెందిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జింబాబ్వేలో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణం. రోడ్లన్నీ గుంటలతో ఉండటం, వాటి మరమ్మతులకు నిధుల కొరత, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేశం ఉత్తర ప్రాంతం పొరుగుదేశం జాంబియాకు వెళ్లే రహదారిపై గత ఏడాది జూన్ లో జరిగిన బస్సు ప్రమాదంలో 43 మంది మృతిచెందారు.