దేశ రక్షణ రంగాన్ని పటిష్ఠపర్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.

రక్షణరంగం పటిష్ఠతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ రంగంలో భారత్ ముందంజలో ఉందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ లోని మారుమూల సరిహద్దు ప్రాంతంలో ITBP జవాన్లతో కలిసి ఆయన నిన్న దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మాజీ సైనిక ఉద్యోగులకు ఒక ర్యాంకు, ఒక పింఛను పథకం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ప్రధానమైందని అన్నారు. సైనికుల కృషివల్లే దేశం భద్రంగా ఉందని, దేశ ప్రజలు నిర్భయంగా ఉండగలుగుతున్నారని ఆయన అన్నారు. సైనికుల కృషి వల్లే దేశీ బలమైన శక్తిగా ఎదిగిందని, 125 కోట్ల మంది భారతీయుల భవితను, కలలను సాకారం చేస్తున్నారని అంటూ ప్రధాని వారికి అభినందనలు తెలిపారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో మన సైన్యం ఇస్తున్న చేయూతకు ప్రపంచ దేశాలు అభినందనలు తెలియజేస్తున్నాయని అన్నారు.