మిజోరాంలో ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై ఆ రాష్ర్ట అధికారులు, ప్ర‌భుత్వేత‌ర సంస్థ‌లు, నాయ‌కుల‌తో ఎన్నిక‌ల సంఘం ఉన్న‌త‌స్థాయి అధికారుల బృందం రేపు స‌మీక్షిస్తుంది.

మధ్యప్రదేశ్ లో – శాసనసభ ఎన్నికలకు – 29 మంది అభ్యర్థులతో – కాంగ్రెస్ పార్టీ – తన నాల్గవ జాబితాను – గత రాత్రి – విడుదల చేసింది. దీంతో – కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన – మొత్తం అభ్యర్థుల సంఖ్య 213 కి చేరింది.   కాగా – కాంగ్రెస్ పార్టీ – ఇంకా 17 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించవలసి ఉంది.   230 మంది సభ్యులు ఉన్న – ప్రస్తుత శాసనసభలో – కాంగ్రెస్ పార్టీ కి – 57 మంది శాసనసభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో – కాంగ్రెస్ పార్టీ – 2003 సంవత్సరం నుండీ – అధికారంలో లేదు.