ర‌క్ష‌ణ‌రంగంలో దేశం ముందంజ‌లో ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అన్నారు. ఉత్త‌రాఖండ్‌లోని స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఐటీబీపీ జ‌వాన్ల‌తో ఆయ‌న నిన్న దీపావ‌ళి పండుగ జ‌రుపుకున్నారు.

ర‌క్ష‌ణ రంగం ప‌టిష్ట‌త‌కు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ చెప్పారు. ఈ రంగంలో భార‌త్ ముందంజ‌లో ఉంద‌ని ఆయ‌న అన్నారు.  ఉత్త‌రాఖండ్‌లో మారుమూల స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఐటీబీపీ జ‌వాన్ల‌తో క‌లిసి ఆయ‌న నిన్న దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మాజీ సైనిక ఉద్యోగుల‌కు ఒక ర్యాంకు,  ఒక పింఛ‌న్ ప‌థ‌కం ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల్లో ప్ర‌ధాన ఉంటుంద‌ని అన్నారు. సైనికుల కృషి వ‌ల్లే దేశంలో భ‌ద్రంగా ఉంద‌ని, దేశ ప్ర‌జ‌లు నిర్భ‌యంగా ఉండ గ‌లుగుతున్నార‌ని ఆయ‌న అన్నారు.  సైనికుల కృషి వ్లే దేశం బ‌లీయ‌మైన  శ‌క్తి  ఎదిగింద‌ని, 125 కోట్ల మేర భార‌తీయుల క‌ల‌ల‌ను సాకారం చేస్తున్నార‌ని అంటూ ప్ర‌ధాని వారికి అభినంద‌న‌లు తెలిపారు. ఐక్య‌రాజ్య‌స‌మితి శాంతి ప‌రిర‌క్ష‌ణ కార్య‌క‌లాపాల‌లో మ‌న సైన్యం చేస్తున్న‌- ఇస్తున్న చేయూత‌కు ప్ర‌పంచ దేశాలు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాయ‌ని అన్నారు.