. శ్రీలంక‌లో నూత‌న ప్ర‌భుత్వం అస్థిత్వంపై అనుమానాలు నెల‌కొన్న త‌రుణంలో కొత్త‌గా ముగ్గురు మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు.

శ్రీలంకలో – నూత‌న ప్ర‌భుత్వం  స్థిరత్వంపై – అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో – నిన్న సాయంత్రం – కొత్త మంత్రులు – పదవీ స్వీకార ప్రమాణం చేశారు.   అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రమాణం చేయించిన ముగ్గురు మంత్రుల్లో – కొత్త ప్రధానమంత్రి సోదరుడు మాజీ స్పీకర్ చమల్ రాజపక్స కూడా  ఉన్నారు.   ఇలా ఉండగా, వచ్చే బుధవారం పార్లమెంటు సమావేశమైనప్పుడు – సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు – ఒక అవకాశం తప్పకుండా ఇవ్వాలని – పార్లమెంటు స్పీకర్ కరు జయసూర్య – కోరారు.   పార్లమెంటులో చేపట్టవలసిన అజెండా పై చర్చించడానికి నిర్వహించిన – పార్టీ నాయకుల సమావేశం అనంతరం – ఆయన – ఈ విధంగా – పేర్కొన్నారు.   కాగా, సభ ప్రారంభమైన రోజునే – విశ్వాస పరీక్ష చేపట్టవలసిన అవసరం లేదని – ప్రభుత్వ వర్గాలు – పేర్కొన్నాయి.   చిన్న పార్టీలు – మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతో – ప్రధానమంత్రి మహిందా రాజపక్స నేతృత్వంలోని – కొత్త ప్రభుత్వానికి – మెజారిటీ కరువైనట్లు – తెలుస్తోంది.  పదవీచ్యుతుడైన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే – సభలో – మెజారిటీ నిరూపించుకునేందుకు వీలుగా – సభను – త్వరగా – సమావేశపరచాలని – కోరారు.