అఫ్ఘ‌నిస్తాన్‌లో ఐక్య‌త‌, బ‌హుత‌త్వాన్ని కాపాడేందుకు, దేశంలో భ‌ద్ర‌త‌, సుస్థిర‌త‌, శ్రేయ‌స్సును పాదుకొల్ప‌డానికీ భార‌త్ – శాంతి, స‌యోధ్య‌ల‌కు అన్ని విధాల మ‌ద్ద‌తు తెలుపుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

అఫ్ఘ‌నిస్తాన్‌లో ఐక్య‌త‌, బ‌హుత‌త్వాన్ని కాపాడేందుకు, దేశంలో భ‌ద్ర‌త‌, సుస్థిర‌త‌, శ్రేయ‌స్సును పాదుకొల్ప‌డానికీ భార‌త్  – శాంతి, స‌యోధ్య‌ల‌కు అన్ని విధాల మ‌ద్ద‌తు తెలుపుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.  అఫ్గానిస్తాన్ ప‌రిస్థితిపై ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్ మాస్కోలో స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌టంపై భార‌త్‌కు అవ‌గాహ‌న ఉంద‌ని అధికార ప్ర‌తినిధి  ఒక‌రు న్యూఢిల్లీలో చెప్పారు. అఫ్గ‌నిస్తాన్ ప్ర‌భుత్వం నిర్వ‌హ‌ణ‌లో అటువంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాల‌న్న‌దే భార‌త్ సుస్థిర అభిప్రాయ‌మ‌ని కూడా ఆ ప్ర‌తినిధి చెప్పారు. ఈ రోజు జ‌రిగే స‌మావేశంలో భార‌త్ అన‌ధికార స్థాయిలో పాల్గొంటుంద‌ని ప్ర‌తినిధి తెలిపారు.