ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ఈ రోజుతో ముగియనుంది.

ఒకే దశలో పోలింగ్ జ‌రుగుతున్న – మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు – ఈ రోజుతో – ముగియనుంది.   230 స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసనసభకు, 40 స్థానాలున్న మిజోరాం శాసనసభకు  ఈ నెల 28వ తేదీన పోలింగు జరుగుతుంది. ఫలితాలు డిసెంబర్ 11వ తేదీన వెల్లడిస్తారు.  మిజోరాంలో – రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ, NGO సమన్వయ కమిటీ నాయకులతోనూ సమావేశం నిర్వహించడానికి గాను – ఉప ప్రధాన ఎన్నికల కమీషనర్ నేతృత్వంలో – ఉన్నత స్థాయి ఎన్నికల కమీషన్ బృందం – ఈ రోజు – ఐజ్వాల్ – సందర్శిస్తుంది.   రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడానికి వీలుగా – ఈ బృందం – వివిధ అంశాలపై –  భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపే అవకాశముంది. హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి లాల్ నున్మావియా చావుంగో ను తొలగించినందుకు వ్యతిరేకంగానూ – ప్రధాన ఎన్నిక అధికారిని తొలగించాలనీ డిమాండ్ చేస్తూ – గత రెండు రోజులుగా N.G.O. లు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.