ప్యూజిలో జ‌రుగుతున్న చైనా ఓపెన్ బాడ్మింట‌న్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశించారు.

ప్యూజిలో జ‌రుగుతున్న చైనా ఓపెన్ బాడ్మింట‌న్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశించారు. ఇదేపోటీ పురుషుల డ‌బుల్స్‌లో భార‌త ఆట‌గాళ్లు సాత్విక్ సాయిరాజ్ రింకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లోకి ప్ర‌వేశించారు. ఈ జంట ఇండోనేషియాకు చెందిన డ‌బ్ల్యు ఎన్ ఆర్య పాంగ్‌కార్య‌నిరా, అడె యూసుఫ్ శాంత‌షో జంట‌ను 16-21, 21-14, 21-15 స్కోరుతో ఓడించింది. త‌దుప‌రి రౌండ్ పోటీలో ఈ భార‌త జంట ఇండోనేషియాకు చెందిన మొహ్మ‌ద్ ఎహ్‌సాన్, హెంద్ర సెతివాన్ జంట‌తో త‌ల‌ప‌డుతుంది.