బంగ్ల‌దేశ్‌లో ఈ ఏడాది డిసెంబ‌ర్ 23న పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి.

బంగ్ల‌దేశ్‌లో ఈ ఏడాది డిసెంబ‌ర్ 23న పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ కేఎం నురుల్ హుదా నిన్న జాతినుద్దేశించి చేసిన ప్ర‌సంగంలో ఈ తేదీని ప్ర‌క‌టిస్తూ దేశంలో స్వేచ్ఛ‌గా, ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి అనువైన ప‌రిస్థితి నెల‌కొంద‌ని అన్నారు. ఈ ఎన్నిక‌కు అన్ని స‌న్నాహాలు ఇప్ప‌టికే దాదాపుగా పూర్తి అయిన్లు కూడా ఆయ‌న చెప్పారు. ఎన్నిక‌ల సంఘం ఈ ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛ‌గా, న్యాయంగా జ‌రుపుతుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల‌ను అర్ధవంతం చేసేందుకు భాగ‌స్వాములు కావాల్సిందిగా ఆయ‌న రాజ‌కీయ పార్టీల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. నామినేష‌న్ల దాఖ‌లుకు న‌వంబ‌రు 19 చివ‌రి తేదీ. 22 ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.