ఈ రోజు నౌకాద‌ళ దినోత్స‌వం ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు

ఈ రోజు నౌకాదళ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకా దళం ఒక రక్షణ కవచంగా నిలిచిందని, తిరుగులేని శక్తిగా ఉందని  నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా చెప్పారు. 1971లో భారత నౌకాదళం యుద్ధనౌకలు కరాచీ రేవుపై దాడి చేసి పాకిస్థాన్పై సాధించిన విజయానికి గుర్తుగా నౌకాదళ దినోత్సవం జరుపుకుంటున్నారు. శాంతి సమయంలో కూడా దేశ  సముద్రప్రాంతానికి, సముద్ర తీరాన్ని రక్షించడంలో, పలు కార్యకలాపాల నిర్వహణలో నౌకాదళ సేవలను ప్రజలకు తెలియజెప్పడానికి పలు కార్య్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునిల్ లాంబా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకా దళం ఒక రక్షణ కవచంగా నిలిచిందని, తిరుగులేని శక్తిగా ఉందని అన్నారు. నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునిల్ లాంబా, సైనిక దళాల అధిపతి General Bipin Rawat, వైమానిక దళం ప్రధానాధికారి Air Chief Marshal BS Dhanoa ఇండియా గేటు వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద అమర వీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ, Admiral Lanba నౌకాదళం యుద్ధానికి పూర్తీ సన్నద్ధతతో ఉందని చెప్పారు. రాష్ట్రపతి Ram Nath Kovind నౌకాదళ  సభ్యులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేశారు. దేశ సముద్ర సరిహద్దులను కాపాడి, వానిజ్యమార్గాలను పరిరక్షించి, మానవతాపరమైన అత్యవసర పరిస్తితుల్లో సహాయపడుతున్నందుకు దేశం నౌకా దళం పట్ల సగర్వంతో ఉందని కోవింద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి Narendra Modi కూడా నౌకాదళంలో సిబ్బంది కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు.