అస్సోం పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.

అస్సోంలోని 16 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ గట్టి భద్రత మధ్య జరుగుతోంది. పంచాయతీ, జిల్లాపరిషత్, గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామపంచాయతీ అధ్యక్షుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 92 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవలసి ఉంది. ఇందుకుగాను 14 వేల 77 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. మొత్తం 43 వేల 515 మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. అధికార కూటమిలోని BJP, అస్సోం గణపరిషత్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, AIUDF  వామపక్ష పార్టీలు బోడో ల్యాండ్, పీపుల్స్ ఫ్రంట్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. 442 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోవిడత పోలింగ్ ఈ నెల 9వ తేదీన జరుగుతుంది. డిసెంబర్ 12న కౌంటింగ్ నిర్వహిస్తారు.