అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీల హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ ను యూఏఈ నుంచి భారత్ కు రప్పించేందుకు ఆయనను సీబీఐ ప్రశ్నిస్తోంది.

అగ‌స్టా వెస్ట్‌లాండ్ హెలికాఫ్ట‌ర్  కుంభ‌కోణంలో ప‌రారీలో ఉన్న బ్రిటిష్ మ‌ధ్య‌వ‌ర్తి క్రిస్టియ‌న్ మైఖేల్‌ను నిన్న రాత్రి యునైటెడ్ అర‌బిక్ ఎమిరేట్స్‌ మ‌న దేశానికి అప్ప‌గించింది. ఢిల్లీ విమానాశ్ర‌యంలో అత‌నిని CBI అరెస్టు చేసింది. 3,600 కోట్ల రూపాయ‌ల  అగ‌స్టా వెస్ట్‌లాండ్ వివిఐపి హెలికాఫ్ట‌ర్ ఒప్పందంలో మైఖేల్ ముడుపులు అందుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ సూచ‌న‌మేర‌కు మైఖేల్‌ను భార‌త్ కు ర‌ప్పించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ అబుదాబిలో యు.ఎ.ఇ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జ‌యేద్‌తో విస్తృత చ‌ర్చ‌లు జ‌రిపిన రోజే ఈ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.  డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ని యుపిఎ ప్ర‌భుత్వ హ‌యాంలో 12 విలాస‌వంత‌మైన హెలికాప్ట‌ర్ల కొనుగోలుకు సంబంధించిన కాంట్రాక్టు ఇది. ఈ హెలికాప్ట‌ర్ల‌ను రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, మాజీ ప్ర‌ధానులు, ఇత‌ర VIPలు ఉప‌యోగించ‌డానికి వీలుగా కొనుగోలు చేయాల‌నుకున్నారు. అయితే – అగ‌స్టా వెస్ట్‌లాండ్ మాతృసంస్థ అయిన ఫిన్‌మెకానికా సంస్థ‌పై ఇట‌లీలో అవినీతికి పాల్ప‌డిన‌ట్టు, భార‌త్‌లో ఈ సంస్థ ముడుపులు చెల్లించిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావ‌డంతో 2014లో ప్ర‌భుత్వం ఈ కాంట్రాక్టును ర‌ద్దు చేసింది. ఈ కేసులో మ‌ధ్య‌వ‌ర్తులుగా వ్య‌వ‌హ‌రించిన ముగ్గురిలో మైఖేల్ ఒక‌రు. ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటున్న మిగిలిన ఇద్ద‌రు గుయిడో హాస్‌చ్‌కే, మ‌రొక‌రు కార్లో జెరోసాలు.