మనదేశపు బరువైన, పెద్దదైన శక్తిమంతమైన జీ-శాట్-11 ఉపగ్రహాన్ని ఫ్రెంచి గయానాలో ఎరియానా రాకెట్ ద్వారా గత అర్థరాత్రి 2 గంటల 7 నిముషాలకు విజయవంతంగా ప్రయోగించారు.

G-శాట్-11 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఇంతవరకు మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలలో ఇదే అత్యంత భారీ ఉపగ్రహం కావడం విశేషం. మారుమూల ప్రాంతాల్లోని కోట్లాది మంది ప్రజల జీవితాలలో మార్పును తెచ్చే ఈ ఉపగ్రహం ప్రయోగం పాత అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. భారతదేశం ఇస్రో శాస్త్రవేత్తలను చూసి గర్వపడుతోందని ప్రధాని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల కృషి ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.