రిజ‌ర్వ్‌బ్యాంక్ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 5వ ద్వైమాసిక ద్ర‌వ్య విధాన స‌మీక్ష‌ను ఈ రోజు వెల్ల‌డించ‌నుంది.

రిజ‌ర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా , ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి 5 వ  ద్వై మాసిక ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌ను ఈ రోజు వెల్ల‌డించ‌నుంది. ఆర్‌.బి.ఐ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ నాయ‌క‌త్వంలోని ఆరుగురు స‌భ్యులుగ‌ల ద్ర‌వ్య‌విధాన నిర్ణ‌య క‌మిటీ త‌న మూడు రోజుల స‌మీక్షా స‌మావేశాన్ని సోమ‌వారం నాడు ప్రారంభించింది.  ముడిచ‌మురు ధ‌ర‌లు ప‌త‌నం, ఆహార ధ‌ర‌లు ఊహించిన దానికంటే త‌క్కువ కావ‌డం, ఒక మోస్త‌రు ఆర్థిక వృద్ధి  త‌దిత‌ర కార‌ణాల‌వల్ల ఆర్‌.బి.ఐ త‌న పాల‌సీ రేట్ల‌లో మార్పు చేయ‌క‌పోవ‌చ్చ‌ని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌.బి.ఐ వాణిజ్య బ్యాంకుల‌కు ఇచ్చే రుణంపై వ‌డ్డీ రేటు అయిన రెపో రేటు 6.5 శాతం వ‌ద్ద అలాగే ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఆర్‌.బి.ఐ గ‌త ద్ర‌వ్య‌స‌మీక్షా విధాన స‌మ‌యంలో కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు చేయ‌లేదు.