భార‌త‌ర‌త్న డా. బి.ఆర్‌. అంబేద్క‌ర్ 63వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా దేశ‌ప్ర‌జ‌లు ఆయ‌న‌ను స్మ‌రించుకుని ఘ‌నంగా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నారు.

భార‌త ర‌త్న డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ 63వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లు ఆయ‌న‌ను స్మ‌రించుకొని ఘ‌నంగా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నారు.  భార‌త‌రాజ్యంగ నిర్మాత అయిన డాక్ట‌ర్ అంబేద్క‌ర్ న్యాయ‌కోవిధులు, ఆర్థిక‌వేత్త, రాజ‌కీయ‌వేత్త‌, సంఘ సంస్క‌ర్త. ద‌ళితులు, మ‌హిళ‌లు, కార్మికుల అణ‌చివేత‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న చేసిన కృషి చిర‌స్మ‌ర‌ణీయ‌మైంది. 1956లో ఇదే రోజున ఆయ‌న మ‌ర‌ణించారు. ప్ర‌తిసంవ‌త్స‌రం ఈరోజున మ‌హాప‌రినిర్వాణ దినాన్ని జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్బంగా దేశ‌వ్యాప్తంగా అనేక కార్య‌క్ర‌మాలు ఏర్పాట‌వుతున్నాయి. రాష్ట్రప‌తి రామ్‌నాథ్‌కోవింద్ పార్ల‌మెంటు భ‌వనం ఆవ‌ర‌ణ‌లో ఉన్న బాబా సాహెబ్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి శ్ర‌ద్ధాంజ‌లి ఘటించారు. ఉప‌రాష్ట్రప‌తి ఎం. వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్‌సింగ్‌, లోక్‌స‌భ స్పీక‌ర్  సుమిత్రా మహాజ‌న్ సామాజిక న్యాయం సాధికార‌త శాఖ‌మంత్రి థావ‌ర్‌చంద్ గెహ‌లోత్‌, కాంగ్రెస్ అధ్య‌క్షులు రాహుల్‌గాంధీ  త‌దిత‌ర ప్ర‌ముఖులు డాక్ట‌ర్ అంబేద్క‌ర్‌కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.