నాల్గ‌వ రైసీనా డైలాగ్ ఈ సాయంత్రం ఢిల్లీలో ప్రారంభ‌మ‌వుతుంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, విదేశాంగ‌మంత్రి సుష్మాస్వ‌రాజ్ స‌మ‌క్షంలో నార్వే ప్ర‌ధాని ఎర్నా సోల్ బ‌ర్స్ ప్రారంభోప‌న్యాసం చేస్తారు.

నాల్గ‌వ రైసీనా డైలాగ్ కార్య‌క్ర‌మం ఈ సాయంత్రం న్యూ ఢిల్లీలో మొద‌ల‌వుతుంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ స‌మ‌క్షంలో నార్వే ప్ర‌ధాన‌మంత్రి ఎర్నా సోల్ బ‌ర్గ్ ప్రారంభోప‌న్యాసం చేస్తారు. అబ్జ‌ర్వ‌ర్ రీసెర్చ్ ఫౌండేష‌న్ భాగ‌స్వామ్యంతో విదేశాంగ శాఖ రైసీనా డైలాగ్ అనే ఈ వార్షిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంది. ప్ర‌పంచ రాజ‌కీయ వ్యూహాత్మ‌క అంశాల‌పై ఈ స‌మావేశాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చిస్తారు. నూత‌న ప్ర‌పంచ ప‌రిస్థితులు, భాగ‌స్వామ్యాలు అనేది ఈ యేటి ఇతి వృత్తంగా స్వీక‌రించారు. 93 దేశాల నుంచి 600 మంది ప్ర‌తినిధులు ఈ స‌మావేశాల్లో పాల్గొంటారు. రాజ‌కీయ నాయ‌కులు, వ్యూహాత్మ‌క మేధావులు, విధాన రూప‌క‌ర్త‌లు, సాంకేతిక ఆవిష్క‌ర్త‌లు, వ్యాపార ప్ర‌తినిధులు, విద్యావేత్త‌లు వారిలో ఉన్నారు.